కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే : మృత్యుంజయం

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర నాయకుడు కటుకం మృత్యుంజయం మండిపడ్డారు. ఆదివారం హుజురాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి తప్పినందుకు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 70 లక్షల కోట్లు దారి మళ్లించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎంపై 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్లలో కూడా […]

Update: 2021-08-15 09:47 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర నాయకుడు కటుకం మృత్యుంజయం మండిపడ్డారు. ఆదివారం హుజురాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి తప్పినందుకు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 70 లక్షల కోట్లు దారి మళ్లించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎంపై 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్లలో కూడా కేసులు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

ఆంక్షలు లేకుండా రైతు బంధు ఎలా అమలు చేస్తున్నారో అదే విధానంతో దళిత బంధు కూడా అమలు చేసి రాష్ట్రంలోని దళితులందరికీ రూ. 10 లక్షల సాయం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా మందులు ఇచ్చే సంతోష్ రావు పేరు కూడా వినపడుతోందని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమే తప్పు అంటుంటే సీఎం రేసులో ఆయన పేరు వినిపిస్తుండటం విస్మయం కల్గిస్తోందని మృత్యుంజయం అన్నారు.

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక కోసం ఐఏఎస్ అధికారులను నియమిస్తామని చెప్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ బంధు అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన ఉండదని కల్లబొల్లి ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News