‘స్కిజోఫ్రేనియా’ ముందే గుర్తిస్తే.. చికిత్స సులువే!

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాల గురించి తక్కువ అవగాహన ఉండటంతో ప్రజలు వాటిని చేతబడి గా పరిగణించారు. కానీ ఇటీవల, చలనచిత్రాలతో సహా అనేక ప్రధాన స్రవంతి ప్లాట్‌ఫామ్స్ అటువంటి అంశాలను సున్నితంగా పరిగణించడంతో, వాటిపై ప్రజల అవగాహనలోనూ మార్పు కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన సారా అలీ ఖాన్, ధనుష్, అక్షయ్ కుమార్ నటించిన ‘అత్రంగి రే’ చిత్రంలోనూ ‘మెంటల్ ఇల్‌నెస్ అండ్ ట్రామా’ అంశాన్ని టచ్ చేశారు. ఇందులోని ప్రధాన పాత్రలలో […]

Update: 2021-12-25 04:26 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాల గురించి తక్కువ అవగాహన ఉండటంతో ప్రజలు వాటిని చేతబడి గా పరిగణించారు. కానీ ఇటీవల, చలనచిత్రాలతో సహా అనేక ప్రధాన స్రవంతి ప్లాట్‌ఫామ్స్ అటువంటి అంశాలను సున్నితంగా పరిగణించడంతో, వాటిపై ప్రజల అవగాహనలోనూ మార్పు కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన సారా అలీ ఖాన్, ధనుష్, అక్షయ్ కుమార్ నటించిన ‘అత్రంగి రే’ చిత్రంలోనూ ‘మెంటల్ ఇల్‌నెస్ అండ్ ట్రామా’ అంశాన్ని టచ్ చేశారు. ఇందులోని ప్రధాన పాత్రలలో ఒకరు స్కిజోఫ్రెనియా లక్షణాలను ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో ‘స్కిజోఫ్రేనియా’ లక్షణాలు తెలుసుకుందాం.

‘అత్రంగి రే’ సమస్యను చిన్నచూపుగా, కొన్ని సమయాల్లో హాస్యాస్పదంగా చూపినందుకు విమర్శలపాలవుతున్నా.. ఈ సమస్యను తెరమీదకు తెచ్చినందుకు దీనిపై కొంతవరకైనా అవగాహన కలుగుతుందని ఆశపడుతున్నారు. ప్రపంచంలో కొన్నేళ్లుగా డిప్రెషన్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తీవ్రమవుతుండగా.. అలాంటి వాటిలో స్కీజోఫ్రేనియా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలోనూ సుమారు ఒక శాతానికి పైగా జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఏదేదో ఊహించుకోవడం, ఏ విషయంపైన ఆసక్తి చూపకపోవడం, ఒంటరిగా ఉండిపోవడం, నలుగురిలో కలిసేందుకు జంకడం, ఎప్పుడూ ఆలోచనల్లోనూ గడపడం, తనలో తాను మాట్లాడుకుంటూ ఉండటం ఇవన్నీ కూడా స్కీజోఫ్రేనియా ప్రారంభ లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు.

స్కీజోఫ్రేనియా రావడానికి నిర్ధిష్టమైన కారణమేమిటో తెలియదు కానీ జెనిటిక్‌‌, బ్రెయిన్ కెమిస్ట్రీలో మార్పులు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ వ్యాధి రావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెదడులో ఉండే డోపమైన్, గ్లూటమేట్, సెరటోనిన్ లాంటి న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్‌‌ వల్ల కూడా ఈ పరిస్థితి రావొచ్చు. మానసిక ఒత్తిడికి గురి చేసే తీవ్రమైన ఆర్థిక నష్టాలు, ఉద్యోగం కోల్పోవడం, ఆప్తుల మరణం వంటి సంఘటనలు కూడా ఈ వ్యాధి వచ్చేందుకు కారణమవుతాయి.

స్కిజోఫ్రేనియా అనేది ఒక మానసిక వ్యాధి. మెదడులోని కొన్ని రసాయనాల అసమతుల్యత కారణంగా ఇది ఏర్పడుతుంది. డోపమైన్ స్థాయిలు పెరిగినప్పుడు.. సైకోసిస్, స్కిజోఫ్రేనియా లక్షణాలకు దారితీస్తుంది. ఎప్పుడూ భ్రమలోనే ఉంటారు. ఎవరో తరుముతున్నారని, చంపుతున్నారని భావిస్తారు. ఏదో ఒకదాన్ని నిజమని నమ్ముతారు, కానీ అది నిజం కాదు. ఎవరైనా వారికి వివరించడానికి ప్రయత్నించినప్పటికీ.. దానిని నమ్మలేరు. శ్రవణ భ్రాంతి కూడా ఓ లక్షణమే. నిత్యం వారికి ఏదో ఓ స్వరం వినిపిస్తుందని చెబుతారు. ఇలాంటి సమయంలో తమలో తామే మాట్లాడుకుంటారు. విజువల్ హెల్యూజినేషన్‌కు కూడా గురవుతారు. లేని వాటిని ఊహించుకుని భయపడుతుంటారు. అతని ప్రకారం, ఈ అనుభవాలు రోగికి వాస్తవమైనవి, అదంతా ఇమాజినేషన్ అని సాక్ష్యాలతో సమర్పించినా కూడా విశ్వసించడానికి నిరాకరిస్తారు. శ్రవణ, దృశ్య, స్పర్శ, ఘ్రాణ వంటి భ్రాంతులను నమ్ముతారు.

– డాక్టర్ పారిఖ్ చెప్పారు,

చికిత్స..

మందుల ద్వారా స్కిజోఫ్రేనియా వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. ఇవి అత్యంత ప్రభావవంతమైనవి. వ్యాధి తొలిదశలోనే గుర్తించి.. అనుభవమున్న మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తొందరగా చికిత్స ప్రారంభిస్తే సుమారుగా 20 శాతం రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ట్రీట్‌మెంట్ పూర్తయ్యే వరకు మాత్రం మందులు తప్పనిసరిగా వాడాలి.

Tags:    

Similar News