కొవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రగాయాల పాలై తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం ఇరాక్ దేశంలోని నస్రియా అల్ హుస్సేన్ కొవిడ్ ఆస్పత్రిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే […]

Update: 2021-07-12 20:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రగాయాల పాలై తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం ఇరాక్ దేశంలోని నస్రియా అల్ హుస్సేన్ కొవిడ్ ఆస్పత్రిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News