108 కి.మీ నాన్‌స్టాప్ సైకిల్ రైడ్‌.. ఆరేళ్ల రియాన్ వరల్డ్ రికార్డ్!

దిశ, ఫీచర్స్ : పాండమిక్ టైమ్‌లో.. ఫిట్‌గా ఉండటం అన్ని వయసుల వారికి సవాల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే చెన్నైకి చెందిన ఆరేళ్ల రియాన్ కుమార్.. నగర వీధుల్ని తన సైకిల్ రైడ్‌కు ట్రాక్‌గా వినియోగించుకున్నాడు. ఆ ఆరోగ్యకర అలవాటే ప్రస్తుతం తనకు గుర్తింపు తీసుకొచ్చింది. నాన్‌స్టాప్ రైడ్‌లో గంటకు 20.8 కిమీ వేగంతో 108.09 కి.మీ.ల దూరాన్ని 5 గంటల17 నిమిషాల్లో ఛేదించి, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన అతి పిన్న […]

Update: 2021-12-08 03:14 GMT

దిశ, ఫీచర్స్ : పాండమిక్ టైమ్‌లో.. ఫిట్‌గా ఉండటం అన్ని వయసుల వారికి సవాల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే చెన్నైకి చెందిన ఆరేళ్ల రియాన్ కుమార్.. నగర వీధుల్ని తన సైకిల్ రైడ్‌కు ట్రాక్‌గా వినియోగించుకున్నాడు. ఆ ఆరోగ్యకర అలవాటే ప్రస్తుతం తనకు గుర్తింపు తీసుకొచ్చింది. నాన్‌స్టాప్ రైడ్‌లో గంటకు 20.8 కిమీ వేగంతో 108.09 కి.మీ.ల దూరాన్ని 5 గంటల17 నిమిషాల్లో ఛేదించి, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’ బ్రేక్ చేశాడు.

రియాన్ తల్లి కమాండర్ గౌరీ మిశ్రా గతంలో 200 కి.మీ.ల ‘బ్రెవెట్ డి రాండన్నూర్ మొండియాక్స్’(BRM) పూర్తిచేసి మద్రాస్ రాండన్నూర్‌గా నిలిచింది. రాండన్నూర్ అనేది పోటీ లేని, టైమ్ లిమిట్‌తో కూడిన సుదూర సైక్లింగ్ కాంపిటీషన్. అతడి అమ్మమ్మ కూడా జాతీయ సైక్లిస్ట్ కాగా.. వారిద్దరి ప్రేరణతోనే రియాన్ సైక్లిస్ట్‌గా మారాడు. లాక్‌డౌన్ తర్వాత సైక్లింగ్ సెషన్స్‌లో పాల్గొని రైడింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. ఇక వారానికి 2-3 సార్లు తండ్రితో కలిసి చెన్నయ్ నుంచి మహాబలిపురం సైక్లింగ్‌ చేస్తుంటాడు.

రికార్డ్ బ్రేక్ లక్ష్యంగా :

టూర్ డి ఫ్రాన్స్ జూలియన్ అలఫిలిప్, మార్క్ కావెండిష్ సహా అతని తల్లి సాధించిన విజయాలు రియాన్‌కు స్ఫూర్తి. తాను కూడా రికార్డ్ బ్రేక్ చేయాలనే ఆశయంతో ప్రతీ రోజు ప్రాక్టీస్ చేసేవాడు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే 50, 80, 100 కి.మీ దూరాన్ని సులభంగా ఛేదించేలా తనను తాను మెరుగుపరుచుకున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా రెండుసార్లు 100 కి.మీ రైడ్స్‌ పూర్తి చేయడంతో రియాన్ తల్లిదండ్రులు లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌కు దరఖాస్తు చేశారు. కొద్ది నెలల్లోనే 100 కి.మీ కంటే ఎక్కువ దూరం నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అక్కడితో ఆగిపోని రియాన్.. అక్టోబర్‌లో ఏకంగా 150 కి.మీల దూరం ప్రయాణించి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఇక ఈ ఫీట్‌‌ను‌ ప్రొఫెషనల్ ‘రోడ్ బైక్‌’తో కాకుండా సాధారణ BMX సైకిల్‌‌తో సాధించడం ప్రశంసించదగ్గ అంశం.

పట్టుదలే నడిపించింది..

‘రియాన్ నిర్దేశించుకున్న టార్గెట్ రీచ్ అయ్యేందుకు అంకితభావంతో ప్రాక్టీస్ చేయడం వల్లే చాంపియన్‌గా నిలిచాడు. కార్టూన్లు చూడాల్సిన వయసులో బైక్‌ ఎలా సర్వీస్ చేయాలో తెలుసుకునేందుకు గ్లోబల్ సైక్లింగ్ నెట్‌వర్క్‌ను చూసేవాడు. రైడ్స్ లేకుంటే ఇంట్లోనే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్టాటిక్ సైక్లింగ్ సాధన చేసేవాడు. కష్టపడి పని చేస్తే, మీరు ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ప్రస్తుతం రియాన్ ‘టూర్ డి ఫ్రాన్స్‌’లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడ’ని రియాన్ తండ్రి అనిమేష్ తెలిపారు.

Tags:    

Similar News