ఆస్తి పన్ను బకాయి వడ్డీ 90శాతం మాఫీ
దిశ, మంచిర్యాల : తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నెంబర్ 306 ద్వారా మున్సిపాలిటీలో 90శాతం పేరుకుపోయిన బకాయి వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఎ. రాధాకిషన్ తెలిపారు. పట్టణంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు పేరుకుపోయిన బకాయిలు తిరిగి చెల్లించడానికి ఆస్తిపన్ను వన్ టైమ్ స్కీమ్ కింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆస్తిపన్నుపై 90శాతం వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసినట్లు వివరించారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి […]
దిశ, మంచిర్యాల :
తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నెంబర్ 306 ద్వారా మున్సిపాలిటీలో 90శాతం పేరుకుపోయిన బకాయి వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఎ. రాధాకిషన్ తెలిపారు. పట్టణంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు పేరుకుపోయిన బకాయిలు తిరిగి చెల్లించడానికి ఆస్తిపన్ను వన్ టైమ్ స్కీమ్ కింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆస్తిపన్నుపై 90శాతం వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసినట్లు వివరించారు.
ఆస్తి పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బకాయిల మొత్తాన్ని క్లియర్ చేస్తే 10 శాతం వడ్డీతో వన్ టైమ్ స్కీమ్ కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సెటిల్మెంట్ గడువు ఆగష్టు 1 నుంచి మొదలై సెప్టెంబర్ 15న ముగుస్తుందని స్పష్టంచేశారు. నస్పూర్ పట్టణ గృహ, వాణిజ్య వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.