ఎమ్మెల్యేల వైద్య ఖర్చులకు రూ.10 లక్షల సాయం.. అసెంబ్లీ ఆమోదం

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల కోసం చట్ట సవరణ చేశారు. రూ.10 లక్షల వరకు సాయం అందేలా రూపొందించిన సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు గరిష్ట పెన్షన్ రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.70 వేలకు పెంచుతూ సభ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఈ […]

Update: 2021-03-25 01:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల కోసం చట్ట సవరణ చేశారు. రూ.10 లక్షల వరకు సాయం అందేలా రూపొందించిన సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు గరిష్ట పెన్షన్ రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.70 వేలకు పెంచుతూ సభ ఆమోద ముద్ర వేసింది.

మరోవైపు ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వయోపరిమితి పెంపుతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు.

Tags:    

Similar News