అసోం సీఎం సర్భానంద సోనోవాల్ రాజీనామా..

దిశ, వెబ్‌డెస్క్ : అస్సోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ తిరిగి రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. అయితే, ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించని కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విశ్వాసపాత్రుడు. ఆదివారం హిమంతను శాసనసభాపక్ష నేతగా సర్బానందా సోనోవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం గువహతిలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. […]

Update: 2021-05-09 07:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అస్సోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ తిరిగి రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. అయితే, ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించని కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విశ్వాసపాత్రుడు. ఆదివారం హిమంతను శాసనసభాపక్ష నేతగా సర్బానందా సోనోవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం గువహతిలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సోనోవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు.

Tags:    

Similar News