దొంగతనంలోనూ ‘జాగ్రత్త’.. SBI బ్యాంకులో 8 లక్షలు చోరీ..!

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడ గ్రామంలోని SBI బ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆడ గ్రామం ప్రధాన రహదారి పక్కనే గల ఎస్బీఐ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు లాకర్ బద్దలు కొట్టి సుమారు రూ.8.5 లక్షల సొమ్మును దొంగిలించారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది లాకర్ తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. […]

Update: 2021-12-06 10:56 GMT

దిశ, ఆసిఫాబాద్ రూరల్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడ గ్రామంలోని SBI బ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆడ గ్రామం ప్రధాన రహదారి పక్కనే గల ఎస్బీఐ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు లాకర్ బద్దలు కొట్టి సుమారు రూ.8.5 లక్షల సొమ్మును దొంగిలించారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది లాకర్ తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ కుమార్, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్, జిల్లా స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ (జాగిలాలు) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని నేర పరిశోధన ప్రారంభించారు. దుండగులు చాకచక్యంగా గ్యాస్ వెల్డింగ్ కట్టర్ల సహాయంతో కిటికీలు తొలగించి అనంతరం సెక్యూరిటీ కెమెరాలను తొలగించినట్టు గమనించారు. స్టోరేజ్ బాక్స్ (DVR)ను సైతం ఎత్తుకెళ్లారు. లాకర్‌ను ధ్వంసం చేసి అందులోని నగదును దొంగిలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వైవీ సురేంద్ర పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.

Tags:    

Similar News