విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి
దిశ, కొత్తగూడెం: రోడ్డు ప్రమాదానికి గురై ఏఎస్సై మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీసీఆర్బీ సెక్షన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేశ్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కర్రల లోడుతో రామవరం బ్రిడ్జి మీదుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే బైక్ పై వస్తున్న సురేష్ లారీని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు సురేశ్ ను […]
దిశ, కొత్తగూడెం: రోడ్డు ప్రమాదానికి గురై ఏఎస్సై మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీసీఆర్బీ సెక్షన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేశ్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కర్రల లోడుతో రామవరం బ్రిడ్జి మీదుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే బైక్ పై వస్తున్న సురేష్ లారీని బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు సురేశ్ ను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.