"ఏఎస్సై హబీబుల్లా కుటుంబానికి 50 లక్షలు ప్రకటించడం హర్షణీయం"

అనంతపురం జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తూ విధి నిర్వహణలో కరోనా సోకి మృత్యువాత పడిన ఏఎస్సై హబీబుల్లా ( నంబర్ 1238) కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయలు ప్రకటించడం హర్షణీయమని జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకి ఏఎస్సై మృతి చెందిన విషయాన్ని సీఎం దృష్టికి తీసీకెళ్లిన రాష్ట్ర డి.జి.పి డి.గౌతం సవాంగ్ , […]

Update: 2020-04-20 02:27 GMT

అనంతపురం జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తూ విధి నిర్వహణలో కరోనా సోకి మృత్యువాత పడిన ఏఎస్సై హబీబుల్లా ( నంబర్ 1238) కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయలు ప్రకటించడం హర్షణీయమని జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకి ఏఎస్సై మృతి చెందిన విషయాన్ని సీఎం దృష్టికి తీసీకెళ్లిన రాష్ట్ర డి.జి.పి డి.గౌతం సవాంగ్ , ఐ.జి ఎన్ సంజయ్ , అనంతపురం రేంజ్ డి.ఐ.జి కాంతి రాణా టాటా, జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబులకు ఈ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర పోలీసు సిబ్బంది మరింత అంకిత భావంతో పాటు రెట్టింపు ఉత్సాహంతో పని చేసేందుకు దోహదం చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

Tags: anantapuram district, parigi police station, a si habibullah

Tags:    

Similar News