11 నెలల తర్వాత రాకెట్ పట్టనున్న బార్టీ
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ నెంబర్ వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ 11 నెలల అనంతరం రాకెట్ పట్టనున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో టోర్నీలకు దూరమైన బార్టీ తిరిగి ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా కోర్టులోకి అడుగుపెట్టనున్నది. గత ఏడాది ఫిబ్రవరినుంచి టెన్నిస్ పోటీలకు దూరంగా ఉన్న బార్టీ ముందుగా మెల్‌బోర్న్‌లో జరుగనున్న డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన బార్టీ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నది. జనవరి 31 […]
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ నెంబర్ వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ 11 నెలల అనంతరం రాకెట్ పట్టనున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో టోర్నీలకు దూరమైన బార్టీ తిరిగి ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా కోర్టులోకి అడుగుపెట్టనున్నది. గత ఏడాది ఫిబ్రవరినుంచి టెన్నిస్ పోటీలకు దూరంగా ఉన్న బార్టీ ముందుగా మెల్‌బోర్న్‌లో జరుగనున్న డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన బార్టీ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నది.
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు మెల్‌బోర్న్ సమ్మర్ సిరీస్‌లో బార్టీ పాల్గొననున్నది. మరోవైపు గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో ఆటకు దూరమైన సెరేనా విలియమ్స్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటానికి నిర్ణయించుకుంది. జనవరి 15 నాటికి టెన్నిస్ ప్లేయర్లందరూ ఆస్ట్రేలియా చేరుకొని 14 రోజుల క్వారంటైన్‌లో గడపనున్నారు.