ఆస్ట్రేలియా ఒలింపిక్ బృందంలో ఆష్ బార్టీ

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న 11 మంది సభ్యుల టీమ్‌ను ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టును వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్ బార్టీ నాయకత్వం వహించనున్నది. మాజీ యూఎస్ ఓపెన్ విజేత సామ్ స్టోసర్ మహిళా సింగిల్స్, డబుల్స్‌లో తలపడనున్నది. ఆమెకు ఇది ఐదో ఒలింపిక్స్ కావడం గమనార్హం. నిక్ కిర్గియోస్, అలెక్స్ డి మినార్, జాన్ మిల్‌మాన్ పురుషుల ఈవెంట్స్‌లో ఆడనున్నారు. ‘ఒలింపిక్స్‌లో తొలి సారి పాల్గొంటున్నా.. […]

Update: 2021-06-29 11:02 GMT

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న 11 మంది సభ్యుల టీమ్‌ను ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టును వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్ బార్టీ నాయకత్వం వహించనున్నది. మాజీ యూఎస్ ఓపెన్ విజేత సామ్ స్టోసర్ మహిళా సింగిల్స్, డబుల్స్‌లో తలపడనున్నది. ఆమెకు ఇది ఐదో ఒలింపిక్స్ కావడం గమనార్హం. నిక్ కిర్గియోస్, అలెక్స్ డి మినార్, జాన్ మిల్‌మాన్ పురుషుల ఈవెంట్స్‌లో ఆడనున్నారు. ‘ఒలింపిక్స్‌లో తొలి సారి పాల్గొంటున్నా.. జట్టును నడిపించడం చాలా సంతోషంగా ఉన్నది. ఆస్ట్రేలియా తరపున పాల్గొనడం నా కల. విశ్వ క్రీడల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.’ అని బార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, టోక్యో ఒలింపిక్స్ కోసం నిర్వాహకులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో మహిళల విభాగంలో సెరేనా విలియమ్స్ ఇప్పటికే మెగా క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. రఫెల్ నదాల్, రోజర్ ఫెదరర్ ఇప్పటికీ ఒలింపిక్స్‌కు దూరమయ్యారు.

Tags:    

Similar News