కేసీఆర్‌కు ఒవైసీ సూటి ప్రశ్న?
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తూ వస్తున్న అసదుద్దీన్ ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కానీ మెట్రో నిర్మాణం విషయంలో ట్విట్టర్ వేదికగా స్పందించి దక్షిణ హైదరాబాద్‌పై ప్రశ్నలు సంధించారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సర్వీసులను ప్రారంభిస్తుండగా పాతబస్తీలో మెట్రో నిర్మాణం పూర్తి కాకపోవడంపై అసదుద్దీన్ పాయింట్ తీశారు. […]
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తూ వస్తున్న అసదుద్దీన్ ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కానీ మెట్రో నిర్మాణం విషయంలో ట్విట్టర్ వేదికగా స్పందించి దక్షిణ హైదరాబాద్‌పై ప్రశ్నలు సంధించారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో సర్వీసులను ప్రారంభిస్తుండగా పాతబస్తీలో మెట్రో నిర్మాణం పూర్తి కాకపోవడంపై అసదుద్దీన్ పాయింట్ తీశారు.
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో నిర్మాణం పూర్తవ్వడం ఓకే కానీ పాతబస్తీలో నిర్మాణాలు ఎందుకు పూర్తి కావట్లేదని, మెట్రో యాజమాన్యంతోపాటు ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. దాదాపు 69 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రభుత్వానికి దక్షిణ హైదరాబాద్‌లోని పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి నిధులు లేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దార్ ఉల్ ఫిషా’ నుంచి ఫలక్‌నుమా వరకు నిలిచిపోయిన మెట్రో పనుల సంగతేంటని ప్రశ్నించారు.