ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌కు మరోసారి బెయిల్ నిరాకరించింది ముంబై స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు. అక్టోబర్ 3న అతన్ని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ… నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(NDPS) యాక్ట్ ప్రకారం సెక్షన్ 8సి, 20బి, 27, 28,28, 35 కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆర్యన్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ కనెక్షన్, డెబ్యుట్ యాక్ట్రెస్‌కు […]
దిశ, సినిమా: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌కు మరోసారి బెయిల్ నిరాకరించింది ముంబై స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు. అక్టోబర్ 3న అతన్ని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ… నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(NDPS) యాక్ట్ ప్రకారం సెక్షన్ 8సి, 20బి, 27, 28,28, 35 కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆర్యన్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ కనెక్షన్, డెబ్యుట్ యాక్ట్రెస్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్‌ను సబ్మిట్ చేసిన ఎన్సీబీ.. ఇప్పటికే అక్రమ మాదకద్రవ్యాల రవాణా, నేరపూరిత కుట్రపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు బెయిల్ మంజూర్ చేయకూడదని కోరింది. దీనిపై వాదోపవాదనలు విన్న స్పెషల్ జడ్జి వి.వి. పాటిల్ తనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇది ఆర్యన్ థర్డ్ బెయిల్ ప్లీ రిజెక్షన్ కాగా.. అర్బాజ్ మర్చెంట్, మన్మున్ దమేచా బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది కోర్టు.
అయితే ఎన్సీబీ స్టార్ కిడ్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ రికవరీ చేయలేదని… కేవలం వాట్సాప్ చాట్ ఆధారంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది ఆర్యన్ లీగల్ టీమ్. మూడోసారి కూడా బెయిల్ రిజెక్ట్ కావడంతో ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది.