వామన్ రావుపై అరుణ జ్యోతి సంచలన ఆరోపణలు
దిశ, కరీంనగర్ సిటీ : రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన అడ్వకేట్ దంపతుల్లో ఒకరైన వామన్ రావుకు కూడా హంతక చరిత్ర ఉందని, నగరానికి చెందిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి భార్య అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ‘నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2008లో నా భర్త వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించక పోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని […]
దిశ, కరీంనగర్ సిటీ : రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన అడ్వకేట్ దంపతుల్లో ఒకరైన వామన్ రావుకు కూడా హంతక చరిత్ర ఉందని, నగరానికి చెందిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి భార్య అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ‘నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2008లో నా భర్త వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించక పోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భర్త ఒత్తిడి తెచ్చారు.
దీంతో నగర శివారులోని అలుగునూర్ వద్ద నా భర్తను కిడ్నాప్ చేసి, అక్కడి నుంచి నల్గొండ జిల్లా వలిగొండ గ్రామంలో హత్య చేశాడు. ఏడాది అనంతరం హత్యోదంతం వెలుగులోకి రావడంతో అప్పటి హోంమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా భర్త హత్యపై నల్గొండ జిల్లాలో కేసు కూడా నమోదు అయినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నాలాగే, అనేకమంది వామనరావు బాధితులు ఉన్నారని, తగిన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. పోలీసు అధికారులు లోతుగా విచారించి, బాధితులకు న్యాయం చేయాలి.