ఆ ఇద్దరే ఎన్ని దొంగతనాలు చేశారంటే..
దిశ,హుజూర్ నగర్: రెండేళ్లుగా జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కోదాడ డీఎస్పీ రఘు వెల్లడించారు. మఠంపల్లి నుంచి హుజూర్ నగర్ రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తు్ండగా అటుగా మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారినే వెంటనే పట్టుకొని విచారించగా గుంటూరు జిల్లాకు చెందిన తమ్మిశెట్టి గోపి, బండి శివకుమార్‌లుగా చెప్పారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు […]
దిశ,హుజూర్ నగర్: రెండేళ్లుగా జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కోదాడ డీఎస్పీ రఘు వెల్లడించారు. మఠంపల్లి నుంచి హుజూర్ నగర్ రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తు్ండగా అటుగా మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారినే వెంటనే పట్టుకొని విచారించగా గుంటూరు జిల్లాకు చెందిన తమ్మిశెట్టి గోపి, బండి శివకుమార్‌లుగా చెప్పారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు.
ఇరువురు ముఠాగా ఏర్పడి గత రెండు నెలల్లో హుజూర్ నగర్ పట్టణంలో 2 బైక్‌లు, మఠంపల్లి మండలంలో ఓ బైక్, చివ్వెంల మండలం ఉండ్రుగొండలో బంగారు పుస్తెల తాడును చోరీ చేశారు. నిందితుల నుండి సుమారు రూ.2 లక్షల విలువైన 3 మోటార్ సైకిళ్లు, లక్షన్నర విలువైన బంగారు పుస్తెల తాడు రికవరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పీఎస్ఐ స్వప్న, ఐడీ పార్టీ సిబ్బంది అజిత్ రెడ్డి, శంభయ్య, నాగరాజు, నాగిరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఆయన వెంట సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, ఏఎస్ఐ సైదులు ఉన్నారు.