ఆ 89 యాప్స్ డిలీట్ చేయండి : ఆర్మీ

దిశ, వెబ్‌డెస్క్ : రక్షణ రంగంలో పనిచేసే వారు తప్పనిసరిగా ఫేస్‌బుక్, ఇన్ స్టాతో సహా 89 యాప్స్ డిలీట్ చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు జవాన్లు, అధికారులు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో దాయాది పాక్ హనీ ట్రాప్ పేరుతో మన సైనికులకు ఎర వేస్తున్నది. దానితో పాటు డ్రాగన్ కంట్రీకి చెందిన హ్యకర్లు మన సైనిక, అధికారుల ఖాతాల ద్వారా దేశ రక్షణకు సంబంధించిన విలువైన […]

Update: 2020-07-08 21:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రక్షణ రంగంలో పనిచేసే వారు తప్పనిసరిగా ఫేస్‌బుక్, ఇన్ స్టాతో సహా 89 యాప్స్ డిలీట్ చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు జవాన్లు, అధికారులు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో దాయాది పాక్ హనీ ట్రాప్ పేరుతో మన సైనికులకు ఎర వేస్తున్నది. దానితో పాటు డ్రాగన్ కంట్రీకి చెందిన హ్యకర్లు మన సైనిక, అధికారుల ఖాతాల ద్వారా దేశ రక్షణకు సంబంధించిన విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు కేంద్రహాంశాఖ ఆదేశాలివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

Tags:    

Similar News