ఆర్జిత సేవల భక్తులకు బ్రేక్ దర్శనం లేదా రీఫండ్..

దిశ, వెబ్‌డెస్క్ : గ‌తేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో 20 మార్చి 2020 నుండి 30 జూన్ 2020 తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తులకు బ్రేక్ ద‌ర్శనం లేదా రీఫండ్ పొందే అవ‌కాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దీనికోసం ఇదివ‌ర‌కే ప‌లుమార్లు టీటీడీ గ‌డువు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈ ఏడాది డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలోపు ఆర్జిత […]

Update: 2021-04-23 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గ‌తేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో 20 మార్చి 2020 నుండి 30 జూన్ 2020 తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తులకు బ్రేక్ ద‌ర్శనం లేదా రీఫండ్ పొందే అవ‌కాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దీనికోసం ఇదివ‌ర‌కే ప‌లుమార్లు టీటీడీ గ‌డువు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈ ఏడాది డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలోపు ఆర్జిత టికెట్లు ఉన్న భక్తులకు తొలుత బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. లేనియెడల రీఫండ్ ఆప్షన్‌ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

Tags:    

Similar News