'రెండో రోజుల్లో సిటీని క్లీన్ చేయండి'
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సిటీని క్లీన్ చేయాలని, లేదంటే ఉద్యోగాలను తొలగించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్‌ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అటువ్యాధులు, కరోనా వ్యాప్తిని […]
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సిటీని క్లీన్ చేయాలని, లేదంటే ఉద్యోగాలను తొలగించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్‌ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలని ముఖ్య కార్యదర్శి తెలిపారు. తమ సర్కిల్ పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంఓహెచ్, ఏసీపీలకు నిర్థారిత పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో వంద శాతం పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ఉంచాలని సూచించారు.
గార్బేజ్ తొలగింపు అనేది ప్రాథమిక విధి అని, వీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ బాధ్యతారహితంగా రహదారులపై చెత్తవేసేవారిని గుర్తించి జరిమానా విధించాలని సూచించారు. వీధులను శుభ్రం చేసే కార్మికులకు చెత్తను సేకరించి సమీప గార్బేజ్ పాయింట్లను వేసేందుకు ప్రత్యేక బ్యాగ్‌లను అందజేస్తున్నామని, దీని వల్ల గార్బేజ్ పాయింట్ల నుంచి చెత్తను త్వరితగతిన తొలగించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
24/7 కంట్రోల్ రూం పనిచేసేవిధంగా, జీహెచ్ఎంసీలో సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున బయో వ్యర్థాలు వస్తున్నాయని, వీటిని తగు నిబంధనల ప్రకారం తీసివేసేందుకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చేపట్టిన చర్యలపై తనిఖీలు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్ లను ఆదేశించారు. గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్ తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు. కోవిడ్-19 సంబంధిత అంశాలపై నగరవాసుల అవసరాలను తీర్చడం, తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి జిహెచ్ఎంసిలో ప్రత్యేక నోడల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.