నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కేసులో కొత్త ట్విస్ట్..

దిశ, వెబ్‌డెస్క్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకుని చివరి భర్త చరణ్ తేజ్ ఆత్మహత్యకు కారణమైన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భార్యపై భర్త చరణ్ తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు భర్త చరణ్ తేజపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. కులం పేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. చరణ్ తేజ్‌పై ఐపీసీ 498ఏ, 506, […]

Update: 2021-05-19 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకుని చివరి భర్త చరణ్ తేజ్ ఆత్మహత్యకు కారణమైన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భార్యపై భర్త చరణ్ తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు భర్త చరణ్ తేజపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. కులం పేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందింది.

చరణ్ తేజ్‌పై ఐపీసీ 498ఏ, 506, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, తన భార్య ముగ్గురిని పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని భర్త చరణ్ తేజ్ రంగారెడ్డి జిల్లా షాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు సంధ్యారాణి టార్చర్ తీవ్రతరం కావడంతో ఆత్యహత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ కేసులో చరణ్ తేజ కుటుంబ సభ్యులు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News