అవి లోకల్ మిడతలే..
దిశ, కరీంనగర్: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలోకి వచ్చిన మిడతలు ప్రమాదకరమైనవి కాదని వ్యవసాయ అధికారి ప్రభావతి స్పష్టంచేశారు. పెద్ద సంఖ్యలో మిడతలు పెద్దంపేట సమీపంలోని గోదావరి తీరానికి వచ్చాయని సమాచారం అందుకున్న ఆమె ఘటనా స్థలికి చేరుకున్నారు. మిడతల ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించగా అవన్నీ కూడా లోకల్ వేనని తేల్చారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే మిడతల దండు గోదావరి పరివాహాక ప్రాంతానికి ఇంకా చేరుకోలేదని వివరించారు. స్థానికంగా తిరిగే […]
దిశ, కరీంనగర్: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలోకి వచ్చిన మిడతలు ప్రమాదకరమైనవి కాదని వ్యవసాయ అధికారి ప్రభావతి స్పష్టంచేశారు. పెద్ద సంఖ్యలో మిడతలు పెద్దంపేట సమీపంలోని గోదావరి తీరానికి వచ్చాయని సమాచారం అందుకున్న ఆమె ఘటనా స్థలికి చేరుకున్నారు. మిడతల ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించగా అవన్నీ కూడా లోకల్ వేనని తేల్చారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే మిడతల దండు గోదావరి పరివాహాక ప్రాంతానికి ఇంకా చేరుకోలేదని వివరించారు. స్థానికంగా తిరిగే ఈ మిడతలు జిల్లెడు చెట్టుపై వాలి తింటుంటాయని వివరించారు. ఒక వేళ ప్రమాదకరమైన మిడతలు వచ్చినట్టయితే వాటిని నివారించేందుకు డ్రోన్ల సాయంతో స్ప్రే చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏఓ ప్రభావతి తెలిపారు.