36 కేసుల మాఫీ కోసం జగన్ కుట్ర :అచ్చెన్నాయుడు

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు మార్చి 5వ తేదీన తలపెట్టిన బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బంద్ ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడతామన్నారు. ఉద్యమానికి మద్దతుగా ఐదు కోట్ల […]

Update: 2021-03-04 06:08 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు మార్చి 5వ తేదీన తలపెట్టిన బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బంద్ ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడతామన్నారు. ఉద్యమానికి మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులను సమీకరిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని చెప్పుకొచ్చారు.

విశాఖ జిల్లాలలోని భూముల్లో వాటాలు కొట్టేయడానికే వైసీపీ ముసలి కన్నీరు కారుస్తోందని ధ్వజమెత్తారు. పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి పోరాడదామని అధికార వైసీపీని పిలిస్తే ఉలుకూ పలుకూ లేకుండా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ వల్ల 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా మొత్తంగా ఐదు లక్షలమందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ వల్ల కేంద్రానికి ఇప్పటివరకూ రూ. 33 వేల కోట్లు, రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లు పన్నుల రూపంలో వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే జగన్ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని .. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని విరుచుకుపడ్డారు. 32 మంది ప్రాణత్యాగం చేసి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటే.. నేడు 36 కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి వారి ప్రాణత్యాగాలను వాడుకుంటున్నారంటూ అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని ప్రజలకు మాజీమత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News