ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 91,849 నమూనాలు పరీక్షించగా 4,458మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,71,475కి చేరింది. అలాగే నిన్న మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,528కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 6,313 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 91,849 నమూనాలు పరీక్షించగా 4,458మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,71,475కి చేరింది. అలాగే నిన్న మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,528కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 6,313 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 18,11,157కి చేరింది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 47,790 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,15,41,486 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు తగ్గడంతో సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందన్న ఆయన..కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందన్నారు. ఇక రికవరీ రేటు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 96.59 శాతంగా ఉంటే.. ఏపీలో 96.67 శాతంగా ఉందని సీఎం జగన్ తెలిపారు.