పవన్ కళ్యాణ్ మాటల రౌడీ..చంద్రబాబు ముసలి రౌడీ: పేర్ని నాని

దిశ, వెబ్ డెస్క్: సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం చంద్రబాబుతో అంటకాగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వెళ్ళమంటే.. రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పేదల చేతుల్లోని క్యారేజీ లాక్కుని పెరుగన్నం తినేసి, మూతి తుడుచుకుని, విమానం ఎక్కేశారని విమర్శించారు. ఆనాడు పవన్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. అదే పవన్ కళ్యాణ్ నేడు బీజేపీతో జతకట్టి అమిత్‌ […]

Update: 2021-03-07 07:26 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం చంద్రబాబుతో అంటకాగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వెళ్ళమంటే.. రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పేదల చేతుల్లోని క్యారేజీ లాక్కుని పెరుగన్నం తినేసి, మూతి తుడుచుకుని, విమానం ఎక్కేశారని విమర్శించారు. ఆనాడు పవన్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. అదే పవన్ కళ్యాణ్ నేడు బీజేపీతో జతకట్టి అమిత్‌ షా, మోదీల చుట్టూ తిరుగుతున్నాడంటూ సెటైర్లు వేశారు.

నిజంగా పవన్‌కు ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కును ఎందుకు కాపాడలేక పోతున్నాడంటూ నిలదీశారు. అవసరమైతే కేంద్రాన్ని బెజవాడ బజార్లలోకి తీసుకువస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్నాడని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ది సినిమా జీవితమని ఆయన మాట్లాడే సొల్లు కబుర్లు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్ని నాని తెలిపారు. ఎన్నికలు కూడా ఆయనకు సంపాదనలాంటిదేనన్నారు. జనరల్‌ ఎన్నికల్లో ఆయనకు సినిమాల్లో మొదటిరోజు కాసులు రాలినట్లు డబ్బు రాలుతూ ఉంటాయి. బీఫారాలు కూడా వేరే వారి చేతుల్లోనే పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రౌడీరాజ్యం నడుస్తుందన్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ రాజ్యం అయితే ఇంత స్వేచ్చగా తిరగగలిగేవాడేనా? మేం సాధు జీవులం కాబట్టే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఈ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ,, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. చంద్రబాబు ముసలి రౌడీ అయితే పవన్‌ మాటల రౌడీ. పవన్‌ తన మాటలతో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అమిత్‌ షా, మోదీతో మాట్లాడి విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రతాపం చూపించాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News