ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,962 సాంపుల్స్ పరీక్షించగా 909 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,94,606కి పెరిగింది. అదే సమయంలో కరోనాతో 13మంది మరణించారు. తాజా మరణాలతో కలుపుకుని మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 13,660 కి చేరింది. […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,962 సాంపుల్స్ పరీక్షించగా 909 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,94,606కి పెరిగింది. అదే సమయంలో కరోనాతో 13మంది మరణించారు. తాజా మరణాలతో కలుపుకుని మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 13,660 కి చేరింది. నిన్న ఒక్కరోజులో 1,543 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,63,728కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218యాక్టివ్ కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,57, 08,411 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.