రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్లు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారానే రైతులకు అవసరమైన అన్ని ఉత్పత్తులను ప్రభుత్వం అందజేస్తోంది. తాజాగా ఈ రైతుభరోసా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై రైతులు నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలు. ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేస్తూ డిజిటల్ విధానంలో చెల్లింపు చేయొచ్చని […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారానే రైతులకు అవసరమైన అన్ని ఉత్పత్తులను ప్రభుత్వం అందజేస్తోంది. తాజాగా ఈ రైతుభరోసా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
ఇకపై రైతులు నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలు. ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేస్తూ డిజిటల్ విధానంలో చెల్లింపు చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ అగ్రోస్ సంస్థ తెలిపింది. ముఖ్యమంత్రి సూచలన మేరకు రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్ల విధానాన్ని అనుసరిస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఇకపై పేటిఎం, ఫేన్ పే, గూగుల్ పే వంటి యాప్ప్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.