ఏపీలో ఇంటర్ సెంకడియర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆన్‌లైన్ ద్వారా ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 30లోపు ఫలితాలను వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం 5,19,797 మంది విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. రెగ్యులర్, ప్రైవేట్ పరంగా ఫీజు చెల్లించిన విద్యార్థులంతా పాస్ అయినట్లు వెల్లడించారు. పాసైన వారిలో […]

Update: 2021-07-23 05:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆన్‌లైన్ ద్వారా ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 30లోపు ఫలితాలను వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం 5,19,797 మంది విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. రెగ్యులర్, ప్రైవేట్ పరంగా ఫీజు చెల్లించిన విద్యార్థులంతా పాస్ అయినట్లు వెల్లడించారు. పాసైన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,86,722 మంది కాగా…ప్రైవేట్‌గా ఫీజు కట్టిన 11,165 మంది విద్యార్థులతో కలిసి మెుత్తం 5,19,797 మంది విద్యార్థులను ఈ ఏడాది ప్రమోట్ చేసినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. ఎవరైతే ప్రైవేట్‌గా ఫీజులు చెల్లించారో వారందర్నీ పాస్ చేసినట్లు తెలిపారు. గతంలో ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు నామమాత్రపు మార్కులతో పాస్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఫలితాల వెల్లడికి సంబంధించి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామని కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సూచనల మేరకు ఫలితాలు వెల్లడి చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు టెన్త్, ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల నుంచి 70% వెయిటేజ్‌, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30% శాతం వెయిటేజ్‌గా తీసుకుని ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అలాగే ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని మంత్రి సురేశ్ తెలిపారు.
విద్యార్థులు ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చని మంత్రి తెలిపారు.
http://examresults.ap.nic.in
http://results.bie.ap.gov.in
http://results.apcfss.in
http://www.manabadi.co.in వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చని మంత్రి సురేశ్ తెలిపారు.

Tags:    

Similar News