ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏ మీడియంలో చదవాలన్నది విద్యార్థి, తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మాతృ భాషలో చదివితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటారని వివరించారు. అనంతరం కోర్టు.. తీర్పును వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ అంశంపై బీజేపీ […]
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏ మీడియంలో చదవాలన్నది విద్యార్థి, తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మాతృ భాషలో చదివితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటారని వివరించారు. అనంతరం కోర్టు.. తీర్పును వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ అంశంపై బీజేపీ నేత సుధీశ్ రాంభొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు ధాఖలు చేసిన సంగతి తెలిసిందే.
tag: govt schools, english medium, GO no; 81, 85, high court