వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా స్ట్రైఫండ్ పెంపు

దిశ, వెబ్‌డెస్క్: వైద్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్ట్రైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారి స్ట్రైఫండ్ రూ.45 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ.75 వేలకు పెంచుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వారి డిమాండ్లపై సీఎస్‌తో చర్చించామన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన విరమించుకోవాలని అనిల్ కుమార్ కోరారు. రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్‌ వీరికి […]

Update: 2021-06-02 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైద్యులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్ట్రైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారి స్ట్రైఫండ్ రూ.45 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ.75 వేలకు పెంచుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వారి డిమాండ్లపై సీఎస్‌తో చర్చించామన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన విరమించుకోవాలని అనిల్ కుమార్ కోరారు.

రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్‌ వీరికి వర్తిస్తుందని తెలిపారు. అయితే జూనియర్‌ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. మరోవైపు పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్‌ పెంచాలన్న డిమాండ్ ఉందని వారి డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏకే సింఘాల్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News