పవన్ కల్యాణ్ విడాకులపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్.. ఇదేనా ధర్మం అంటూ ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు(Seediri Appalaraju) తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-09-28 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు(Seediri Appalaraju) తీవ్ర విమర్శలు చేశారు. శనివారం అప్పల్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు సనాతన ధర్మం పేరుతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. భార్యకు విడాకులు ఇవ్వమని ఏ సనాతన ధర్మంలో ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉందని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు లెఫ్ట్ ఐడియాలజీతో పార్టీ పెట్టి.. ప్రపంచ విప్లవకారుడు చేగువేరాను ఆదర్శంగా తీసుకున్నారు.. ఇప్పుడు ఆ చేగువేరా ఆదర్శాలు ఎటుపోయాయని మండిపడ్డారు. ‘మా ఆవిడ క్రిస్టియన్, పిల్లలు ఆర్ద్రోస్ అన్నారు. అసలు ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయి’ అని అప్పల్రాజు మండిపడ్డారు.

 కేవలం స్వార్థ రాజకీయాల కోసం దేవుడ్ని వాడుకుంటున్నారని సీరియస్ అయ్యారు. నెయ్యి కల్తీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారు.. కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తు్న్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేదని మీరే నోటీసులు ఇస్తారు? తిరుమలకు ఎవరూ వెళ్లొద్దని మీరే అంటారని సీరియస్ అయ్యారు. అసలు మీకు చట్టంపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతారు. డిప్యూటీ సీఎంతో సహా మంత్రులంతా ఆ అబద్ధాలను నిజం చేసే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నెయ్యిలో కల్తీ జరిగితే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించండి అని సూచించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిందని.. పాలన గాలికి వదిలి అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.


Similar News