ఏపీలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.  కోటీకి పైగా కరోనా వ్యాక్సిన్ టెస్ట్ లతో వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. కొత్తగా 500 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 500 కరోనా […]

Update: 2020-12-15 23:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. కోటీకి పైగా కరోనా వ్యాక్సిన్ టెస్ట్ లతో వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

కొత్తగా 500 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,76,336 కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంగళవారం నాటికి గడిచిన 24 గంటల్లో 563 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు 8,64,612 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా సోకి 7,064 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,660 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News