జగన్ జగమొండి..ఏపీలో హాట్ టాపిక్
దిశ వెబ్‌డెస్క్: మాట తప్పను.. మడం తిప్పను అంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. జగన్ పట్టుపడితే వదిలేది లేదంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. దీనికి గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వారు చూపిస్తున్నారు. ఇంతకీ గత కొంతకాలంగా ఏం జరుగిందన్న వివరాల్లోకి వెళ్తే… దివంగత రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తరువాత రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ చోటుచేసుకుంది. […]
దిశ వెబ్‌డెస్క్: మాట తప్పను.. మడం తిప్పను అంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. జగన్ పట్టుపడితే వదిలేది లేదంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. దీనికి గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వారు చూపిస్తున్నారు. ఇంతకీ గత కొంతకాలంగా ఏం జరుగిందన్న వివరాల్లోకి వెళ్తే…
దివంగత రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తరువాత రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ చోటుచేసుకుంది. దీంతో పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేసుకుని జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు. అప్పటి నుంచి ప్రత్యర్థులకు జైలు పక్షి అంటూ విమర్శించే అవకాశం లభించింది. ఆర్థిక నేరగాడంటూ టీడీపీ నేతలు ఎగతాళి చేయడం ఆరంభించారు. అవసరం ఉన్నా లేకున్నా ఫ్యాక్షనిస్టు అంటూ విమర్శించారు.
ప్రత్యర్థుల ప్రతి విమర్శను జగన్ నవ్వుతూనే భరించారు. వాటికి ఏనాడూ ఆయన సమాధానమివ్వలేదు. ఎట్టకేలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునే సమయం కోసం ఎదురు చూశారు. నేరుగా కక్షసాధింపు చర్యలకు దిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించారు. అందుకే సరైన ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగారు. తొలుత రాజధాని పరిధిలో కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో నిర్మితమైన కట్టడాలపై చర్యలు ప్రారంభించారు. టీడీపీ కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కట్టడాన్ని అక్రమ కట్టడం అంటూ కూల్చేశారు. ఈ సమయంలో ఆ కట్టడం నిర్మాణంలోని లొసుగులను ప్రజలముందు పెట్టారు.
తరువాత పోలవరంలో అవినీతిని బయటపెడితే నజరానా ఇస్తామంటూ ప్రకటన చేశారు. అయితే అవినీతిలో భాగమైన వారు బయటకు వచ్చే అవకాశం లేదు. అవినీతిలో భాగం కానివారు దానిని నిరూపించే అవకాశాలు అత్యల్పం దీంతో అక్కడ అవినీతిపై ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు అంటూ అవినీతి జరిగిందని ప్రజలకు చెప్పారు. మరోవైపు విద్యావ్యవస్థలోని లోపాలను కడగాలని నిర్ణయించారు. దీంతో కొన్ని స్కూళ్లు మూతబడ్డాయి. ఏపీలో ప్రైవేటు విద్యారంగంలో రారాజుగా వెలిగిపోతున్న నారాయణ విద్యాసంస్థలకు ఇది మిగుడుపడని వ్యవహారంగా తయారైంది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. దీంతో ప్రైవేటు స్కూళ్లు ఆత్మరక్షణలో పడిపోయాయి.
రాజశేఖరరెడ్డి సీఎంగా తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ గతంలో బాబు నిర్ణయం తీసుకున్నట్టు… బాబు చిరకాల ప్రతిష్ఠకు చిహ్నమైన రాజధానిపై దృష్టిసారించారు. దీంతో అమరావతి ఒక్కరాజధాని మూడు రాజధానులైంది. అక్కడ ఆందోళనలు ఆరంభం కాగానే కేటాయింపులు, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రధానంగా సీఆర్డీయే పరిధిలోని వ్యవహారాలపై సిట్ ఆరాతీస్తోంది. ఇక్కడ ఏమాత్రం అవకతవకలు జరిగినట్టు నిరూపణైతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటోయోనని ఆందోళణవ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాబు మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డే తనను ఏమీ చేయలేకపోయారని, జగన్ మాత్రం ఏం చేస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో రాజధాని అమరావతే అంటూ వైజాగ్ వాసులను ఒప్పించేందుకు బాబు విశాఖపట్టణంలో అడుగుపెట్టబోయారు. ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2017లో బాబు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించింది. అప్పుడెలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో…అచ్చం అదేరీతిలో.. అలానే బాబును హైదరాబాదుకు తిప్పిపంపారు. దీంతో పంతం పట్టిన బాబు తాను వైజాగ్‌లో పర్యటించి తీరుతానని ప్రతినబూనారు… అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?… బాబు ఎంత ప్రతినబూనినా.. జగన్ తల్చుకుంటే మరోసారి బాబు వైజాగ్‌లో అడుగుపెట్టగలరా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019 శాసనసభ ఎన్నికల్లో వైజాగ్‌లోనే టీడీపీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది. అది కూడా అర్బన్‌లోనే పార్టీ కేడర్ కూడా బలంగానే ఉంది. అలాంటి చోట చంద్రబాబును అడుగుపెట్టనీయకుండా చేయడంలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే జగన్ జగమొండి..అనుకున్నది సాధిస్తాడంటూ ఏపీలో ఒక చర్చ నడుస్తోంది.