ఇసుక క్వారీలో లారీ వాలాల ఆందోళన.. ఇచ్చిన డబ్బు ఏం చేశారు.?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసక రీచ్ వద్ద లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజులుగా క్వారీ వద్ద లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాము టీఎస్ఎండీసీకి సన్న ఇసుక కోసం డీడీలు చెల్లిస్తే తీరా వేళకు దొడ్డు ఇసుక లోడ్ చేస్తామంటున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ లోడ్‌కు బ్రేక్.. అయితే, నిన్నటి వరకు ఈ రీచ్‌లో లారీల్లో ఓవర్ లోడ్‌తో ఇసుకను […]

Update: 2021-07-27 06:29 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసక రీచ్ వద్ద లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజులుగా క్వారీ వద్ద లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాము టీఎస్ఎండీసీకి సన్న ఇసుక కోసం డీడీలు చెల్లిస్తే తీరా వేళకు దొడ్డు ఇసుక లోడ్ చేస్తామంటున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్ లోడ్‌కు బ్రేక్..

అయితే, నిన్నటి వరకు ఈ రీచ్‌లో లారీల్లో ఓవర్ లోడ్‌తో ఇసుకను నింపారని ఈరోజు టీఎస్ఎండీసీ అధికారులు ఈ విధానాన్ని బ్రేక్ చేయాలని ఆదేశించడం వల్లే సన్న ఇసుక లేదంటున్నారని లారీ డ్రైవర్లు, యజమానులు ఆరోపిస్తున్నారు. తాము సన్న ఇసుక కావాలని దరఖాస్తు చేసుకుంటే దొడ్డు ఇసుక లోడ్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తమకు గిట్టుబాటు కాదని వారంటున్నారు. దీంతో, బొమ్మాపూర్ క్వారీలో ఆందోళన సమాచారం అందుకున్న వెంటనే టీఎస్‌ఎండీసీ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారితో కూడా తమ ఆవేదనను వెళ్లగక్కారు లారీ ఓనర్లు. ఇసుక డంప్ చేసిన చోటకు రహదారి లేదంటున్నారని అయితే, తాము డీడీల ద్వారా డబ్బులు చెల్లించినప్పుడే రోడ్ డ్యామేజ్‌కు కూడా అమౌంట్ కడుతున్నామని.. క్వారీ ఓనర్లు రోడ్ లేదని అనడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

ఒకే క్వారీకి రెండు డంప్‌లా.?

సాధారణంగా వర్షాకాలానికి ముందు గోదావరి నుంచి ఇసుకను తీసి డంప్ చేసుకునేందుకు టీఎస్ఎండీసీ నిబంధనలు వర్తిస్తాయి. అయితే, బొమ్మాపూర్ క్వారీ విషయంలో మరో చోట ఉన్న ఇసుకను లోడ్ చేస్తామని యజమానులు చెప్తున్నారంటే ఒకే క్వారీకి రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసుకునే విధంగా నిబంధనలు వర్తిస్తాయా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. క్వారీలో నిరంతరం ఉంటూ ఇసుక లోడింగ్‌ను సజావుగా నిర్వహించాల్సిన టీఎస్ఎండీసీ ఉద్యోగులు పట్టించుకోకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది.

Tags:    

Similar News