నకిలీ ఐటీ రిటర్న్స్‌తో నయా మోసం

దిశ, క్రైమ్‌బ్యూరో: నకిలీ ఐటీ రిటర్న్స్‌తో నయా మోసానికి పాల్పడిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ ప్రాంతానికి చెందిన అన్వర్ ఎల్బీనగర్‌లోని విమల్ హైర్ పర్చేజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, విమల్ అసోసియేట్స్ ఫైనాన్స్ కంపెనీలో నకిలీ రిటర్స్ అందజేసి కారును తీసుకున్నాడు. కొన్నినెలలు ఈఎంఐలను సక్రమంగా చెల్లించిన అన్వర్.. మళ్లీ అదే ఫైనాన్స్ సంస్థ ఎండీ సురేశ్ చాంద్ జైన్‌ను […]

Update: 2020-12-19 08:44 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: నకిలీ ఐటీ రిటర్న్స్‌తో నయా మోసానికి పాల్పడిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ ప్రాంతానికి చెందిన అన్వర్ ఎల్బీనగర్‌లోని విమల్ హైర్ పర్చేజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, విమల్ అసోసియేట్స్ ఫైనాన్స్ కంపెనీలో నకిలీ రిటర్స్ అందజేసి కారును తీసుకున్నాడు. కొన్నినెలలు ఈఎంఐలను సక్రమంగా చెల్లించిన అన్వర్.. మళ్లీ అదే ఫైనాన్స్ సంస్థ ఎండీ సురేశ్ చాంద్ జైన్‌ను నమ్మించి మరో రెండు ఇన్నోవా క్రిస్టా, టయోటా ఫార్చునర్‌ వాహనాలను తీసుకున్నాడు. వీటికి కూడా కొన్ని నెలలు మాత్రమే ఈఎంఐలు చెల్లించిన అన్వర్ ఆతర్వాత సైలెంట్ అయిపోయాడు. రికవరీ ఏంజెంట్లు వచ్చినా ఆ వాహనాలు కనపడకుండా చేశారు. ఇదేక్రమంలో గొల్కొండ ప్రాంతంలో గౌస్ మొహినుద్దీన్ అనే వైద్యుడి నుంచి రియల్ ఎస్టేట్ పేరిట రూ.75లక్షలు తీసుకొని, మళ్లీ అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ రెండు విషయాలపై కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. రూ.1.20కోట్ల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News