చరిత్ర సృష్టించిన అన్షు మాలిక్

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. నార్వే లోని ఓస్లో వేదికగా జరుగుతున్న 17వ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో అన్షు మాలిక్ ఉక్రెయిన్‌కు చెందిన సలోమియా యుంక్‌పై 11-0 తేడాతో విజయం సాధించింది. మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అన్షు మాలిక్ సలోమియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో అన్షు మాలిక్ టెక్నికల్ సుపీరియారిటీతో మ్యాచ్ గెలిచినట్లు రిఫరీలు ప్రకటించారు. కాగా, వరల్డ్ […]

Update: 2021-10-06 11:13 GMT

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. నార్వే లోని ఓస్లో వేదికగా జరుగుతున్న 17వ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో అన్షు మాలిక్ ఉక్రెయిన్‌కు చెందిన సలోమియా యుంక్‌పై 11-0 తేడాతో విజయం సాధించింది. మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అన్షు మాలిక్ సలోమియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో అన్షు మాలిక్ టెక్నికల్ సుపీరియారిటీతో మ్యాచ్ గెలిచినట్లు రిఫరీలు ప్రకటించారు. కాగా, వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఏ మహిళా రెజ్లర్ కూడా ఫైనల్స్ చేరలేదు.

ఇప్పటి వరకు ఇండియాలో ఈ చాంపియన్‌షిప్‌లో కేవలం కాంస్య పతకాలే లభించాయి. ఇప్పుడు అన్షు ఫైనల్ చేరడంతో స్వర్ణం లేదా రజతం దక్కే అవకాశాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ 2020లో నిరాశ పరిచిన అన్షు.. ఓటమి నుంచి త్వరగా కోలుకొని వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నది.

Tags:    

Similar News