వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్
దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ మహిళా అధికారి సుధాసింగ్‌ను విచారణ నుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఎస్పీ స్థాయి అధికారి రామ్‌కుమార్ నియమితులయ్యారు. దీంతో రామ్ కుమార్ ఆదివారం సాయంత్రం కడపకు చేరుకున్నారు. సీబీఐ మహిళా అధికారి సుధాసింగ్ 49 రోజులుగా కేసును విచారిస్తున్నారు. ఈ కేసులోని అనుమానితులను విచారిస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ […]
దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ మహిళా అధికారి సుధాసింగ్‌ను విచారణ నుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఎస్పీ స్థాయి అధికారి రామ్‌కుమార్ నియమితులయ్యారు. దీంతో రామ్ కుమార్ ఆదివారం సాయంత్రం కడపకు చేరుకున్నారు.
సీబీఐ మహిళా అధికారి సుధాసింగ్ 49 రోజులుగా కేసును విచారిస్తున్నారు. ఈ కేసులోని అనుమానితులను విచారిస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని సేకరించారు. ఈ కేసులో రంగన్న వాంగ్మూలం కీలకమని..త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నవార్తలు వినిపించాయి.
అయితే సుధాసింగ్ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో, ఆమె స్థానంలో రామ్‌కుమార్ వచ్చారు. ఈ కేసు తుదిదశకు చేరుకుందనుకుంటున్న తరుణంలో కొత్త అధికారి రావడం సంచలనంగా మారింది. కొత్త బాస్ ఈ కేసును అధ్యయనం చేస్తున్నారని అందువల్లే రెండు రోజులుగా అనుమానితులను విచారణకు పిలవలేదని తెలుస్తోంది.