ఎస్ఈసీ‌కి మరో ప్రివిలేజ్ నోటిస్

దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ పై మరో ప్రివిలేజ్ నోటిస్ దాఖలు కానుంది. ఎస్ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్టు సమాచారం. వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీడియా ఆంక్షలు విధించడం.. కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మరో వైపు కోర్టును మంత్రి కొడాలి నాని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై విచారించాలని ప్రివిలేజ్ […]

Update: 2021-02-13 04:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ పై మరో ప్రివిలేజ్ నోటిస్ దాఖలు కానుంది. ఎస్ఈసీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నట్టు సమాచారం. వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీడియా ఆంక్షలు విధించడం.. కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మరో వైపు కోర్టును మంత్రి కొడాలి నాని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై విచారించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం‌. ఇవాళ, రేపో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News