కరీంనగర్‎లో మరో పాజిటివ్ కేసు

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు మరొకటి నమోదయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతని సోదరునికి ఈ వ్యాధి సోకిందని ఆమె వివరించారు. కాగా, అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించామని స్పష్టం చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 252 కరోనా శ్యాంపిల్స్ […]

Update: 2020-04-06 10:25 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు మరొకటి నమోదయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతని సోదరునికి ఈ వ్యాధి సోకిందని ఆమె వివరించారు. కాగా, అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించామని స్పష్టం చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 252 కరోనా శ్యాంపిల్స్ సేకరించామని.. ఈ రోజు 28 షాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించినట్టు ఆమె వివరించారు.

tag: Another positive case, Karimnagar,

Tags:    

Similar News