మరో 75 మంది సిక్కుల తరలింపు
దిశ వెబ్‌సైట్: ఆఫ్ఘాన్ నుంచి మరో 75 మంది సిక్కులను న్యూఢిల్లీకి సోమవారం భారత్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కాబూల్‌లో పరిస్థితి రోజు రోజుకి క్లిష్టంగా మారుతుండటంతో వీరందరిని మన దేశానికి తరలించింది. వీరిని మొదట కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాంబేకి పంపింది. అక్కడి నుంచి నిన్న రాత్రి దేశ రాజధానికి తీసుకువచ్చినట్లు ఢిల్లీలోని సిక్కు గురుద్వారా అధికారి మంజీందర్ సింగ్ మీడియాకు సమాచారమందించారు. సిక్కులను తరలించటంలో విదేశాంగ కార్యాలయం, ప్రధాని కార్యాలయం పూర్తిగా సహకరించాయని ఆయన […]
దిశ వెబ్‌సైట్: ఆఫ్ఘాన్ నుంచి మరో 75 మంది సిక్కులను న్యూఢిల్లీకి సోమవారం భారత్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కాబూల్‌లో పరిస్థితి రోజు రోజుకి క్లిష్టంగా మారుతుండటంతో వీరందరిని మన దేశానికి తరలించింది. వీరిని మొదట కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాంబేకి పంపింది. అక్కడి నుంచి నిన్న రాత్రి దేశ రాజధానికి తీసుకువచ్చినట్లు ఢిల్లీలోని సిక్కు గురుద్వారా అధికారి మంజీందర్ సింగ్ మీడియాకు సమాచారమందించారు. సిక్కులను తరలించటంలో విదేశాంగ కార్యాలయం, ప్రధాని కార్యాలయం పూర్తిగా సహకరించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆగస్ట్ 15 న కాబూల్ తాలిబన్ల వశం కావటంతో ప్రజలంతా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే భారత పౌరులతో పాటు, అక్కడ మైనారిటీ సిక్కులను సైతం మన దేశానికి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని కోరారు. నిన్న రాత్రి దుషాంబే నుంచి వచ్చిన విమానంలో సైతం ఇద్దరు సిక్కు యువకులు ఉన్నారు. ప్రస్తుతం వీరు ఢిల్లీలోని సిక్కు గురుద్వారాలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.