తెలంగాణలో మరో ‘4’ ఒమిక్రాన్ కేసులు..టెన్షన్‌లో అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో ఒమిక్రాన్ తేలినట్లు ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అయితే వారి పేర్లు, అడ్రస్ వివరాలను మాత్రం అధికారులు ప్రకటించలేదు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 కు చేరింది. ఈనెల 11న అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ్నుంచి నేరుగా వెస్ట్బెంగాల్వెళ్లిపోయిన వ్యక్తినీ కలుపుకుంటే ఆ సంఖ్య ఏడుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో ఒమిక్రాన్ తేలినట్లు ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. అయితే వారి పేర్లు, అడ్రస్ వివరాలను మాత్రం అధికారులు ప్రకటించలేదు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6 కు చేరింది. ఈనెల 11న అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ్నుంచి నేరుగా వెస్ట్బెంగాల్వెళ్లిపోయిన వ్యక్తినీ కలుపుకుంటే ఆ సంఖ్య ఏడుకు పెరుగుతుంది. సదరు బాలుడి శాంపిల్ సేకరణ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరినందున ఈ కేసు తెలంగాణ స్టేట్ లెక్కల్లోనే కేంద్రం చూపుతున్నది. కానీ రాష్ట్ర అధికారిక బులిటెన్లలో వైద్యశాఖ ఆరు గానే ప్రకటించింది. ఇప్పటికే ఇద్దరి వ్యక్తులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యం పొందుతుండగా, గురువారం నిర్ధారణ అయిన వ్యక్తులను ట్రేస్చేస్తున్నట్లు డీహెచ్శ్రీనివాసరావు పేర్కొన్నారు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత విషయాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలతో పాటు అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. దీంతో కరోనా కట్టడి కోసం వేగంగా చర్యలు చేపడుతున్నారు.
మూడు రోజుల క్రితమే..
కొత్తగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు కెన్యా దేశస్తులు కాగా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి లండన్‌నుంచి తిరిగివచ్చినట్లు సమాచారం. అతను మూడు రోజుల క్రితమే సిటీకి వచ్చినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో పాజిటివ్ రావడంతో ఎట్‌రిస్క్ దేశం ట్రావెల్ హిస్టరీ ఉన్నందున అతన్ని టిమ్స్‌కు తరలించారు. ఇక కెన్యాకు చెందిన ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక వ్యక్తి ఉన్నారు. వీరు 4 రోజుల క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు సమాచారం. ర్యాండమ్ టెస్టింగ్‌లో భాగంగా ఎయిర్‌పోర్టులో ఈ ముగ్గురి సాంపిల్స్ తీసుకుని పంపించగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా, గురువారం ఒమిక్రాన్ ఉన్నట్టుగా నిర్దారణ అయింది. కెన్యాకు చెందిన ముగ్గురు 4 రోజుల నుంచి బయటే తిరుగుతున్నారు. హైదరాబాద్‌లోని వేర్వేరు హోటళ్లు, మాల్స్ చుట్టూ తిరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ముగ్గురినీ ట్రేస్ చేసి గురువారం రాత్రి టిమ్స్‌కు తరలించినట్టు తెలిసింది.