ఆ జిల్లాకు మరో 10వేల టెస్ట్ కిట్స్

దిశ ప్రతినిధి, ఖమ్మం: రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కర్ణన్ బుధవారం తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక కరోనా నిర్ధారణ కేంద్రాల ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైనవారికి ర్యాపిడ్ టెస్టులు […]

Update: 2020-07-15 03:06 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కర్ణన్ బుధవారం తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక కరోనా నిర్ధారణ కేంద్రాల ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైనవారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు.

Tags:    

Similar News