కుండపోత.. అన్నారం 46, మేడిగడ్డ బ్యారేజీ 57 గేట్లు ఎత్తివేత

దిశ, మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలోకి సోమవారం ఎగువ నుంచి 2.3.9000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లకు గాను 46 గేట్లు ఎత్తి 1.6.2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం119.00 మీటర్లకు గాను ప్రస్తుతం114.48 మీటర్ల వరకు నీరు ఉంది. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను, […]

Update: 2021-09-27 01:35 GMT

దిశ, మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలోకి సోమవారం ఎగువ నుంచి 2.3.9000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లకు గాను 46 గేట్లు ఎత్తి 1.6.2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం119.00 మీటర్లకు గాను ప్రస్తుతం114.48 మీటర్ల వరకు నీరు ఉంది. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 3.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నది గోదావరితో కలిసి కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9.070 మీటర్ల ఎత్తులో గోదావరి, ప్రాణహిత నదుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీలోకి 4.92.200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లకు గాను 57 గేట్లు ఎత్తి 5.48.500 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 100.00 మీటర్లకు గాను ప్రస్తుతం 96.00 మీటర్ల లెవల్‌లో నీరు ఉంది. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 6.157 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Tags:    

Similar News