18 నిమిషాలు..హీరోయిన్ ఒంటి నిండా తేనెటీగలు
దిశ, సినిమా: నటి ఏంజలినా జోలీ తేనెటీగల పరిరక్షణకు మద్దతిచ్చింది. ఈ క్రమంలో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కోసం జరిగిన ఫొటో షూట్‌లో వేలాది తేనెటీగలతో తన శరీరాన్ని కప్పి ఉంచారు. దాదాపు 18 నిమిషాల పాటు అసలు ఎలాంటి కదలిక లేకుండా ఈ ఫొటోలకు పోజిచ్చిన ఏంజిలినా జోలి.. ఎలాంటి ప్రొటెక్షన్ వాడకపోవడం గమనార్హం. వైట్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఉన్న తన షోల్డర్స్, చెస్ట్, ఫేస్‌పై వందలాది తేనెటీగలు సంచరిస్తుండగా.. ఫొటో షూట్ నిర్వహించారు. […]
దిశ, సినిమా: నటి ఏంజలినా జోలీ తేనెటీగల పరిరక్షణకు మద్దతిచ్చింది. ఈ క్రమంలో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కోసం జరిగిన ఫొటో షూట్‌లో వేలాది తేనెటీగలతో తన శరీరాన్ని కప్పి ఉంచారు. దాదాపు 18 నిమిషాల పాటు అసలు ఎలాంటి కదలిక లేకుండా ఈ ఫొటోలకు పోజిచ్చిన ఏంజిలినా జోలి.. ఎలాంటి ప్రొటెక్షన్ వాడకపోవడం గమనార్హం.
వైట్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఉన్న తన షోల్డర్స్, చెస్ట్, ఫేస్‌పై వందలాది తేనెటీగలు సంచరిస్తుండగా.. ఫొటో షూట్ నిర్వహించారు. వీటిలో ఒక తేనెటీగ డ్రెస్ లోపలికి వెళ్లి డిస్టర్బ్ చేసినా అలాగే స్టడీగా నిల్చున్నానన్న ఏంజలినా… తాను తప్పా సెట్‌లో అందరూ కూడా తేనెటీగల నుంచి రక్షణకు ప్రొటెక్టివ్ సూట్స్ ధరించారని తెలిపింది. దీనిపై స్పందించిన ఫొటోగ్రాఫర్ డాన్ వింటర్స్.. ఈ ఫొటోషూట్‌ను ఇన్‌స్పైరింగ్ ఈవెంట్‌గా అభివర్ణించాడు. తేనెటీగలను ప్రశాంతంగా ఉంచేందుకు సెట్‌ను నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచాల్సి వచ్చిందన్నాడు. ఏంజలినా శరీరంపై ఎక్కడైతో తేనెటీగలు గుమిగూడాలి అనుకున్నానో.. ఆ చోట ఫెరోమోన్ అప్లై చేశామని చెప్పాడు. ‘వరల్డ్ బీ డే’ కోసం చేసిన ఈ ఫొటోషూట్ చరిత్రలో నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశాడు.