తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం.. ఆ సంస్థల్లోనూ డిపాజిట్లు మాయం!
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు అకాడమీలో జరిగిన డిపాజిట్ల విత్ డ్రా స్కాంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ అండ్ టీం డబ్బులు కాజేసినట్టు తెలుస్తోంది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో సాయికుమార్ రూ.10కోట్లు కొట్టేసినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి రూ.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా గుట్టుగా డ్రా చేసినట్టు తెలిసింది. మొత్తంగా ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు అకాడమీలో జరిగిన డిపాజిట్ల విత్ డ్రా స్కాంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ అండ్ టీం డబ్బులు కాజేసినట్టు తెలుస్తోంది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో సాయికుమార్ రూ.10కోట్లు కొట్టేసినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి రూ.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా గుట్టుగా డ్రా చేసినట్టు తెలిసింది.
మొత్తంగా ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు విత్ డ్రా చేశాడు. ఆ డిపాజిట్లను ఐఓబీ బ్యాంకు నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ ద్వారా ముందు నిధుల బదిలీ చేసి.. ఆ తర్వాత విత్ డ్రా చేసినట్టు విచారణలో వెల్లడైంది.ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదుకు రంగం సిద్ధం చేసినట్టు ఏపీ పోలీసులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని తెలుగు అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై ఏపీ పోలీసులు కూడా దృష్టి సారించినట్టు తెలిపారు.