వైసీపీ నేత గంగిరెడ్డి అరెస్ట్

వైసీపీ నేత, ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Update: 2024-08-26 15:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులో ఆదివారం జరిగిన ఓ గొడవ విషయమై పోలీసులు అరెస్టు చేశారు. సుమారు గంటపాటు విచారించిన అనంతరం విడిచి పెట్టారు. ఆదివారం ఓ థియేటర్ వద్ద జరిగిన గొడవలో.. థియేటర్ యాజమాన్యం పోలీసులకు కంప్లయింట్ చేయడంతో పోలీసులు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని, విచారణ అయ్యాక వదిలి పెట్టారు. అయితే పలు వార్తా ఛానెల్స్ గంగిరెడ్డి అరెస్టును ప్రచారం చేయగా.. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెంటనే గంగిరెడ్డిని తన వద్దకు తీసుకు రమ్మని ఆదేశించారు. పోలీసులు మళ్ళీ గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని, ఎస్పీ ముందు ప్రవేశ పెట్టారు. అయితే ఈ ఘటనపై గంగిరెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గంగిరెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కావడం, దీనిపై పలు కేసులు ఉండటం వల్లే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.    


Similar News