Heavy Rain Alert:అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు
రాష్ట్రాన్ని వర్షాలు(Rains) వీడడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు మరోసారి భారీ వర్షం(Heavy Rain) ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు సూచించారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని వర్షాలు(Rains) వీడడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు మరోసారి భారీ వర్షం(Heavy Rain) ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు సూచించారు. ఈ క్రమంలో దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు(శనివారం) అల్పపీడనం ఏర్పడి, రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఆ తర్వాత తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేసింది. అయితే అల్పపీడన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.