Tirumala:శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వ దర్శనానికి సమయం ఎంతంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Update: 2024-11-22 03:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తోంది. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడకుండా, నిర్ణీత 3 గంటల్లోనే దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు(శుక్రవారం) సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని దర్శించుకున్న 60,803 మంది భక్తులు కాగా.. 21,930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదు అయింది.

Tags:    

Similar News