AP Legislative Council: గత ప్రభుత్వ అప్పు రూ.9,74,000 కోట్లు.. మండలిలో గందరగోళం
గత ప్రభుత్వం చేసిన అప్పుపై టీడీపీ నేతలు.. వైసీపీ సభ్యుల్ని ప్రశ్నించడంతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్.. మండలి సమావేశాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం చేసిన అప్పుపై టీడీపీ నేతలు.. వైసీపీ సభ్యుల్ని ప్రశ్నించడంతో ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్.. మండలి సమావేశాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వం అప్పులు చేసిందని, ఆ అప్పులు అక్షరాలా 9 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అని వివరించారు. చట్ట సభలకు తెలియకుండానే ఆ మొత్తాన్నీ ఖర్చు చేశారని మంత్రి వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలకు తెలియకుండానే ఖర్చు చేశారనడంపై నిరసన తెలిపారు. ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో మండలిలో గందరగోళం నెలకొంది.