YSRCP: ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్.. గంటా ప్రసాదరావు రాజీనామా

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైంది.

Update: 2024-09-05 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైంది. దీంతో పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులు సైతం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అధినేత ఎంత సర్ది చెప్పినా.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ అధినేత జగన్‌కు షాక్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. జిల్లాలో సీనియర్ నేతల అయిన గంటా ప్రసాద‌రావు పార్టీని విడుతున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్‌కు పంపించారు. కాగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన భార్య గంటా పద్మశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యభర్తలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 


Similar News