Kadapa: ఆంజనేయ ఆలయం కింద 16వ శతాబ్దం నాటి తెలుగు శాసనం
వైయస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం 'గండి'లో 16వ శతాబ్దం కాలంనాటి తెలుగుశాసనం వెలుగుచూసినట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి తెలిపారు...
దిశ, కడప: వైయస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం 'గండి'లో 16వ శతాబ్దం కాలంనాటి తెలుగుశాసనం వెలుగుచూసినట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి తెలిపారు. గండిక్షేత్రంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో తవ్వకాల్లో శాసనాన్ని కనుగొని అక్కడ ఆలయ అధికారులు, వేదపండితులు రామ్మోహన్ సహకారంతో సంబంధిత ఫోటోలను సేకరించారని చెప్పారు. వాటిని శాసన పరిశోధకులు ఆచార్య కె.మునిరత్నం రెడ్డికి పంపినట్లు తెలిపారు.
ఆ శాసనంలో ‘దుందుభినామ సంవత్సరం మార్గశిర శుద్ధ ద్వాదశినాడు కొండునాయల కుమారుడు బాలకొండ తన తల్లిదండ్రుల పుణ్యం కోసం గండివద్ద హనుమంతుడిని ప్రతిష్ఠించినట్లు ఉందని ఆచార్య కె.మునిరత్నం రెడ్డి తెలిపారని చింతకుంట శివారెడ్డి పేర్కొ్న్నారు.